Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ కి రుద్ర.. రానని చెప్పేసిన గంగ!
on Dec 17, 2025

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -143 లో..... గంగని తీసుకొని రమ్మని ఇంట్లో డిస్కషన్ చేస్తుంటారు. వద్దని శకుంతల అంటుంది. తీసుకొని వస్తానని పెద్దసారు అంటాడు. ఎక్కడ డిస్కషన్ పెద్దగా అయి గంగని తీసుకొని వస్తారోనని వీరు టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఫుడ్ ఫెస్టివల్ కి మనం వెళ్ళాలి అని అంటాడు. నేను అదే అందామని అనుకుంటున్నానని రుద్ర అంటాడు. సరే నువ్వు దాని గురించి చూసుకోమని వీరుకి రుద్ర చెప్తాడు.
ఆ తర్వాత ఫుడ్ ఫెస్టివల్ కి సంబంధించినది నువ్వు చూసుకోమని రుద్రతో పెద్దసారు అంటాడు. సరే అని రుద్ర అంటాడు. అదేంటి వీరు చూసుకుంటానని అన్నాడు కదా అని శకుంతల అనగానే.. ఎవరు చూసుకుంటే ఏంటి.. కావాలంటే రుద్రకి అసిస్టెంట్ గా వీరు ఉంటాడని పెద్దసారు అంటాడు. ప్రీతీ మనం గంగ దగ్గరికి వెళ్దామని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ప్రీతీ, ప్రమీల, పెద్దసారు ముగ్గురు కలిసి గంగ దగ్గరికి వెళ్తారు. గంగని రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. నేను రాను నేను ఏ తప్పు చెయ్యలేదు.. అది ఆయన నమ్మి, నన్ను తీసుకొని వెళ్ళాలని గంగ వాళ్ళని తిరిగి పంపిస్తుంది. ఆ తర్వాత గంగ తన తల్లికి వైద్యం చేయించడం కోసం డబ్బులు కోసం పని చూసుకుంటుంది. తను గతం లో చేసిన సిలిండర్ డెలివరీ చేసిన దగ్గరికి వెళ్లి పని కావాలని అడుగుతుంది. నువ్వు పెద్దింటి కోడలివి.. నువ్వు నా దగ్గర పని చేస్తే నాకు మాట వస్తుందని అతను అంటాడు. అప్పడే శ్రీను వచ్చి గంగని తీసుకొని వెళ్తాడు.
ఆ తర్వాత పెద్దసారు కోపంగా ఇంటికి వస్తాడు. ఏమైందని శకుంతల అడుగగా.. గంగ ఇంటికి రానని చెప్పిందని ప్రీతీ చెప్తుంది. ఆ తర్వాత పెద్దసారు, రుద్ర దగ్గరికి వెళ్తాడు. నువ్వు గంగని తీసుకొనిరా.. తనేం తప్పు చెయ్యలేదని పెద్దసారు కోప్పడుతాడు. నేను తీసుకొని వస్తాను కానీ నేను ఈ ఇంట్లో ఉండనని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



